26 March, 2026 | 7:17 PM

అత్త గిఫ్ట్‌గా ఇచ్చిన చీరలో...

23-10-2024 12:00 AM

శోభితా ధూళిపాళ్ల, నాగ చైతన్యల పెళ్లి సందడి ప్రారంభమైంది. వీరిద్దరికీ ఈ ఏడాది ఆగస్ట్ 8న నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుక చాలా సింపుల్‌గా జరిగింది. ప్రస్తుతం పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. పసుపు దంచే కార్యక్రమంతో పెళ్లి పనులను శోభి ఇంట ప్రారంభించారు. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ పసుపు దంచే కార్యక్రమంలో శోభిత సింపుల్‌గా గ్రీన్ బోర్డర్‌తో ఉన్న పింక్ కలర్ కంజీవరం సిల్క్ శారీని ధరించారు. అయితే ఆ చీరను నాగ చైతన్య తల్లి లక్ష్మీదగ్గుబాటి బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో లగ్జరీ అవుట్ ఫిట్‌ను పక్కనబెట్టి కుటుంబ సంప్రదాయానికి విలువనిచ్చేలా చక్కటి చీరలో శోభితా ధూళిపాళ్ల అందంగా మెరిసిపోతున్నారు.