11 August, 2026 | 6:51 PM

కలెక్టరేట్ ధర్నా విజయవంతం చేయాలి

11-08-2026 06:08 PM

నిర్మల్,(విజయక్రాంతి): బీడీ కార్మికులకు జీవనభృతి అమలు చేయాలని ఈనెల 13న  కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఐఎఫ్టియు జిల్లా నాయకులు రాజన్న తెలిపారు. జిల్లాలో ఆసరా పెన్షన్లు బీడీ కార్మికుల ఆప్షన్ తొలగించడానికి నిరసిస్తూ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని రకాల కేటాగిరిల కార్మికులకు ధర్నాకు హాజరుకావాలని కోరారు. చేయూత పథకం ద్వారా 4016 రూపాయల జీవన భృతి అమలు చేయాలని ఈనెల 13న గురువారం చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామన్నారు.

కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో బీడీ కార్మికుల జీవన భృతి ప్రభుత్వం ప్రకటించకపోవడం అన్యాయమని తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జిల్లా నాయకులు శ్యామ్ రావు రాజు లక్ష్మణ్ ముత్యం తదితరులు పాల్గొన్నారు.