11 August, 2026 | 7:00 PM

కిరుగుల్ ఉన్నత పాఠశాలలో బోనాల పండుగ

11-08-2026 06:17 PM

కుబీర్,(విజయక్రాంతి): ముధోల్ మండలంలోని కిర్గుల్ బి ఉన్నత పాఠశాలలో బోనాల మంగళవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  డప్పు సప్పుల్ల నడుమ చిన్నారి పోతరాజులు చిందులు వేయగా, బోనం ఎత్తుకున్న విద్యార్థినులు పోచమ్మ గుడి వరకు శోభాయాత్రగా వెళ్ళి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.