22 April, 2026 | 6:54 PM

బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ ప్రారంభం

02-12-2024 11:42 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని పీజీ కళాశాలలో ప్రభుత్వం మంజూరు చేసిన బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం హైదరాబాదు నుండి వర్చువల్ గా ప్రారంభం చేశారు. నర్సింగ్ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా నిర్మల్ జిల్లాలో బిఎస్సి నర్సింగ్ కళాశాలను అందుబాటులో తేవడం జరిగిందని ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి తన సందేశంలో విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వైద్య కళాశాల సిబ్బంది, ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు.