24 August, 2026 | 10:38 PM

Breaking News

కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •  

విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి

24-08-2026 09:26 PM

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి 

కోదాడ,(విజయక్రాంతి): విద్యార్థులు పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలోని మహాత్మ జ్యోతి పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా, సృజనాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల అభివృద్ధికి అన్ని విధాల పాటుపడతానని ఎమ్మెల్యే అన్నారు.

అనంతరం కళాశాల సిబ్బంది ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ ప్రణయ సమన్వయ అధికారి ఈ స్వప్న, కాలేజీ ప్రిన్సిపాల్ కే.శోభారాణి, నేరేడుచర్ల ప్రిన్సిపల్ ఎం .శ్రీనివాస్, ఆత్మకూరు ప్రిన్సిపాల్ జ.వెంకటేశ్వర్లు, చిలుకూరు ప్రిన్సిపాల్ సిహెచ్ .వీరయ్య స్టాఫ్ ఏ .నరేష్, పి  గోపాలకృష్ణ, బి.సురేష్, జి ఆదినారాయణ, ఎం శ్రీను, ఎం. రవీందర్, డి. జ్యోతి, మహమ్మ ఫిర్దోజ్ హెల్త్ సూపర్వైజర్ కే నాగమణి తదితరులు పాల్గొన్నారు.