2 September, 2026 | 12:01 AM

మేఘనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం...

15-06-2025 | 10:15pm

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ గోపాల్పూర్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించబడిన మేఘనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(Meghna Multi Speciality Hospital)ను ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy), కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ... హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే హాస్పిటల్ యొక్క లక్ష్యంగా ఉండాలని ఆకాంక్షించారు. తమ ఆహ్వానన్ని మన్నించి విచ్చేసిన ఎమ్మెల్యే కి, అతిథులకు ప్రత్యేకంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ భగీరథ అత్తే, డాక్టర్ మేఘన ముడిదే. ఈ కార్యక్రమంలో శ్రీ గోదా విష్ణు వర్ధన్ రెడ్డి, గుడిమల్ల రవికుమార్ కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, సాయిని నరేందర్, గుద్దే వెంకన్న, శ్రీధర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.