14 August, 2026 | 7:54 PM

పాల్వంచలో విజయవంతమైన క్యాటరాక్ట్ శస్త్రచికిత్స

14-08-2026 06:48 PM

నవభారత్ ఐ సెంటర్ ఎల్విపీఐ 

పాల్వంచ,(విజయక్రాంతి): కొంటా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మాజీ క్యాబినెట్ మంత్రి కవాసి లఖ్మా కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వహించిన క్యాట్రాక్ట్ శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఈ ఏడాది జులై  06 పాల్వంచలోని ఎల్ బి ప్రసాద్ కంటి ఆసుపత్రికి  కంటి పరీక్ష కోసం వచ్చారు. కంటి పరీక్షను డా. హార్దిక్ ఖురానా  నిర్వహించారు. పరీక్ష అనంతరం ఆయన కుడి కంటిలో క్యాటరాక్ట్ ఉన్నట్లు గుర్తించి, క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు.

అందులో భాగంగా ఆగస్టు 13 న కవాసి లఖ్మా కుడి కంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స నిర్వహించారు. డా. కొలిపాక గౌరీ ప్రతిన్య (ఫ్యాకల్టీ డాక్టర్) ఆధ్వర్యంలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. శస్త్రచికిత్స అనంతరం  కవాసి లఖ్మా స్థిరమైన ఆరోగ్య పరిస్థితిలో ఉండగా శుక్రవారం  ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఈ సందర్భంగా కవాసి లఖ్మా  నవభారత్ కంటి ఆసుపత్రి కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది అందించిన నాణ్యమైన వైద్య సేవలు, చికిత్స, రోగి సంరక్షణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డా.కొలిపాక గౌరీ ప్రతిన్యకి, అలాగే అడ్మినిస్ట్రేటర్  దేవిచందర్ రావు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలిపారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి కేంద్రంగా ప్రజలకు అత్యుత్తమ నేత్ర వైద్య సేవలను అందించడంలో నిరంతరం కృషి చేస్తున్నట్లు అడ్మినిస్ట్రేటర్ దేవిచందర్ తెలిపారు.