పెరిగిన కేటాయింపులు
21-03-2026 01:32 AM
యువజన, పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.2,127 కోట్లను కేటాయించారు. ఇందులో పర్యాటక రంగానికి రూ.1,224 కో ట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్ లో యువజన, పర్యాటక, సాంస్కృతిక శా ఖలకు కలిపి రూ.1,411 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో 716 కోట్లు అదనంగా కేటాయించారు. ఇప్పటికే టూరిజం పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 2025 నుంచి 2030 వరకు దాన్నీ అమలు చేయనుంది.




