17 April, 2026 | 2:43 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రాష్ట్రంలో పెరిగిన చలి

16-12-2025 01:00 AM

రానున్న రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

సిర్పూర్‌లో 7.6 డిగ్రీలు

హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. మంగళ, బుధవారాల్లో పలు ప్రాంతాల్లో శీతలగాలులు వీస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే సోమవారం రాష్ట్రంలో చలితీవ్రత పెరిగింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పంగా 7.6 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్‌లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.