16-12-2025 01:01:42 AM
చండూరు, డిసెంబర్ 15 (విజయ క్రాంతి): చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలోని 9వ వార్డులో కరెంటు తీగల చుట్టూ తీగ జాతి మొక్కలు, గుబురుగా పెరిగిన కంపచెట్లతో ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈదురు గాలులు గాలులు వీచినప్పుడు విద్యుత్ తీగలుఒకదానికొకటి రాపిడి జరిపి నిప్పురవ్వలు చెలరేగుతు న్నాయని స్థానికులు వాపోతున్నారు. వర్షం వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందోనని కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. కరెంటు తీగలకు వేలాడుతున్న పిచ్చి తీగలు కరెంటు వైర్ల చుట్టూ అల్లుకున్నాయి.
వర్షం వస్తుందంటే చిన్నపిల్లలు ఆ చెట్ల దగ్గరకు పోతే ఏమవుతుందోనని ఆ కాలనీవాసులు బేబిలెత్తుతున్నారు . కాలనీల మధ్యలో కరెంటు తీగలు తీగ మొక్కలతో గుబురుగా పెరిగిన కంప చెట్లతో కరెంటు తీగలు మూసుకపోయాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి కరెంటు తీగలకు అల్లుకున్న తీగ మొక్కలను, కంప చెట్లను తొలగించాలని కోరుతున్నారు.