పెంచిన గ్యాస్ ధరలు
వెంటనే తగ్గించాలని సిపిఐ నిరసన
షాద్‌నగర్,(విజయక్రాంతి): పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలో మండల పార్టీ కార్యదర్శి జిల్లెల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో చౌరస్తాలో రోడ్డుపై కాలి సిలిండర్ పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ ఇస్లామిక్ దేశమైన ఇరాన్ పై అమెరికా యుద్ధం చేస్తుంది.
ఆ కారణంతో క్రూడ్ ఆయిల్ ధరలు కొరత ఉందని గ్యాస్ ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అంత మంచిది కాదు అని ఆయన మండిపడ్డారు. ఇరాన్ భారత మిత్ర దేశమని భారత్ కుఎప్పుడు సహకరిస్తూ వస్తున్న ఇరాన్ ను వదిలేసి అగ్రరాజ్యమైన అమెరికా సంకనికి కూర్చోవడం భారత ప్రధాని మోడీకిసరైనది కాదు ఆయన ఈతవు పలికారు. అమెరికా దేశ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ మాటలు వింటే భారతదేశానికి అపారమైన నష్టం వాటిలుతుంది అదిభవిష్యత్తులో భారతదేశానికి ముప్పు తలపెట్టి అవకాశం ఉంద ని దాన్ని మోది ప్రభుత్వం పసిగట్టి మసులుకుంటే మంచిదని తెలిపారు.
గోదావరి ఒడ్డున గ్యాస్ నిక్షేపాలను ఆదానికి కట్టబెట్టి పైప్ లైన్ల ద్వారా గుజరాత్ రాష్ట్రానికి తరలించకపోతుంన్నారు అని ఆయన ఆరోపించారు. ఇప్పటికే పెరిగే ధరలని, నియంత్రించలేని మోడీ గ్యాస్ ధరలు పెంచి ములిగేనకపై తాటికాయ పడ్డట్టు గా ప్రజలపై పారాలు మోపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు వెంటనే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని అమెరికా ఇజ్రాయిల్ ఉచ్చులో చిక్కుకోవద్దని భారత దేశ సారా బహుమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఉంది.
ఆ దిశగా పయనించాలని లేని యెడల యావత్ భారతదేశం ఉన్న 140 కోట్ల మంది జనాభా ముందు బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం దోషిగా నిలబడాల్సి వస్తుందని ఆయన తెలియజేశారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అధికారం ఉంది మేము ఏమైనా చేస్తామని మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తే బిజెపి పట్టావో అని దేశ ప్రజలు మొత్తం బిజెపి ప్రభుత్వంపై తిరగబడక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎండి షబ్బీర్ మండల కార్యవర్గ సభ్యులు లింగమయ్య మండల నాయకులు పాపయ్య ఈదమ్మ జంగమ్మ రవి చంద్ర మ్మ కిషోర్ తదితరులు పాల్గొన్నారు




