16 March, 2026 | 8:32 PM

బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

16-03-2026 03:54 PM

* ట్రాన్స్ జెండర్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ ప్రసన్న కుమార్

పాపన్నపేట: ట్రాన్స్ జెండర్లు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, శుభకార్యాలకు వెళ్లి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ హెచ్చరించారు. సోమవారం పాపన్నపేటలోని మంజీరా గార్డెన్స్ లో ట్రాన్స్ జెండర్లకు  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సొసైటీలో అందరూ భాగస్వాములే అని, వివిధ గ్రామాలు, ఏడుపాయల్లో శుభ కార్యాలలో ఇష్టారీతిన డబ్బులు డిమాండ్ చేయవద్దన్నారు. గౌరవంగా ప్రవర్తించని యెడల చట్టం పరంగా చర్యలు ఉంటాయన్నారు. జిల్లా సంక్షేమ అధికారిణి హేమాభార్గవి, సీఐ జార్జి, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.