11 March, 2026 | 12:10 AM

తీర్థయాత్రలకు.. చలో చలో

09-03-2026 01:44 AM

టీజీఆర్టీసీలో పెరుగుతున్న టూర్లు 

సురక్షిత ప్రయాణం.. భక్తి వాతావరణం 

కుబీర్, మార్చి 8 (విజయక్రాంతి): ప్రయాణికుల సేవ ప్రథమ కర్తవ్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఆర్టీసీ భక్తులకు యాత్రానందం పేరుతో టీజీ ఆర్టిసి సేవలు మరింత విస్తృతం చేస్తుంది. జిల్లాలోని నిర్మల్ భైంసా డిపో పరిధిలో యాత్ర ఆనందం సర్వీస్ పై భక్తుల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించి వివిధ దేవాలయాలకు ప్రసిద్ధ ప్రదేశాలకు. జాతరలకు, పుణ్యక్షేత్రలకు పర్యాటక ప్రాంతాలకు టీజీ ఆర్టీసీ సర్వీసులను నడిపిస్తున్నారు.

డిపోలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకుని గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజా ప్రతినిధులు మహిళా సంఘాలు, ఆధ్యాత్మిక భక్తులు, సామాజిక సేవకులను కలిసి యాత్ర ఆనందం సర్వీస్‌లపై విస్తృత అవగాహన కల్పి స్తూ టూర్ ప్యాకేజీ నిర్వహిస్తున్నారు. గత ఆరు నెలలు నిర్మల్, బైంసా డిపో పరిధిలో ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు ఈ సర్వీస్‌లను ఏర్పాటు చేయడంతో తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా టీజీ ఆర్టీసీ మినిమం చార్జితోనే పూర్తి చేసుకుంటున్నారు. సురక్షిత ప్రయాణం. భక్తి వాతావరణం. టూర్ గైడ్స్ ఏర్పాటు చేసి భక్తులకు నమ్మకంగా దర్శనలను కల్పిస్తున్నారు. 

42 మంది సిద్ధంగా ఉంటే చాలు..

టీజీ ఆర్టీసీలు యాత్ర ఆనందం సర్వీసులు భక్తులు కోరుకున్న ప్రదేశానికి తీసుకెళ్లడమే కాకుండా వారి ఇంటి నుంచి తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత తీసుకుంటున్నారు. ఇప్పటికీ జిల్లా నుండి తిరుపతి రామేశ్వరం అరు ణాచలం అయోధ్య జగనాథ్ పూర్ పండరిపు రం శిరిడి మహోర్ కాలేశ్వరం భద్రకాళి ఆల యం యాదగిరిగుట్ట శ్రీశైలం కొండగట్టు వేములవాడ తదితర పుణ్యక్షేత్రంతోపాటు పర్యాటక ప్రాంతాలకు కూడా ఈ సర్వీసులను నడిపిస్తున్నారు. యాత్రలకు వెళ్లాలనుకునేవారు 42 మంది సిద్ధంగా ఉంటే చాలు అక్కడి కి వెళ్లి సేవలు అందిస్తున్నారు. గతంలో తీర్థయాత్రలకు వెళ్లేవారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించేవారు.

వాహనాల కండిషన్ బాగా లేకపోవడం ఓవర్ స్పీడ్ డ్రైవర్ల సీనాటి లేకపోవడం భక్తులకు ఎన్నో ఇబ్బందులు కలిగేవి. ఇప్పుడు టీజీ ఆర్టీసీ ద్వారా మంచి కండిషన్లో ఉన్న బస్సులు. అనుభవజ్ఞులైన డ్రైవర్ కండక్టర్లు. ప్రదేశాలను చూపించే సిబ్బంది ఏర్పాటు చేయడంతో భక్తులు ఆర్టీసీ సేవల వైపే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల టీజీ ఆర్టీసీకి ఆదాయం పెరగడమే కాకుండా విశ్వాసం కూడా ఏర్పడుతుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రతి వారం రోజులకు సరి టూర్ గైడ్ అమలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులపై పెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రచార పోస్టర్లు టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో వస్తున్నారు

సుదూర ప్రాంతాలకు సర్వీసులు

టీజీ ఆర్టీసీ ద్వారా అమలు అవుతున్న యాత్ర ఆనందం సర్వీస్ లకు భక్తుల నుంచి మంచి స్పందన ఏర్పడుతుంది. టీజీ ఆర్టీసీ ద్వారా సురక్షిత ప్రయాణం చేసుకోవచ్చు. ఇప్పటికే సుదూర ప్రాంతాలకు సైతం సర్వీసులను ఏర్పాటు చేశారు. 40 భక్తులు ఉంటే చాలు వారి వద్దకి బస్సు వెళ్లి సేవలు అందిస్తుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్విని చూసుకోవాలి. 

పండరి, నిర్మల్ డీఎం