మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, మార్చి 8 (విజయక్రాంతి): మగవారితో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగాl ఆదివారం ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు, మహిళా వార్డు మెంబర్లు, మహిళా సర్పంచులు, మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే దంపతులు సన్మానించి చీరలు పంపిణీ చేశారు.
అదేవిధంగా మారుగూడ పంచాయతీ కేంద్రంలో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దేవుగూడ లో నూతన అంగన్వాడి భవనం నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా రాన్నించినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. మగవారు ఈ సందర్భంలో నైనా మహిళలను గౌరవించాలని కోరారు. హెచ్.పి.వి వ్యాక్సిన్ ఆరోగ్యానికి శ్రేయస్కారం అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్ ఆసుపత్రి లో నిర్వహించిన హెచ్.పి.వి వ్యాక్సిన్ అవగాహన ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. హెచ్ పీ వీ వ్యాక్సిన్ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కారమని వ్యాక్సి న్‌పై అపోహలు వద్దని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని తెలిపారు. ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుక రావడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.




