10 April, 2026 | 7:28 PM

Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం   •   దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •  

వరంగల్, నల్లగొండలో ఇంక్యూబేషన్ కేంద్రాలు

12-10-2025 03:32 AM

‘టీ-హబ్’ తరహాలో ఏర్పాటు.. కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం

‘కేయూ ఫార్మా అలుమ్ని’ గోల్డెన్ జూబ్లీ ప్రారంభ వేడుకల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : తెలంగాణను ‘ఇన్నోవేషన్ హబ్’గా మార్చాలన్నదే తమ సంకల్పమని, వరంగల్, నల్లగొండలోనూ టీ-హబ్ తరహాలో ఇంక్యూబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్న ట్టు రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయాలతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్టు వివరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘కాకతీయ యూనివర్సిటీ ఫా ర్మా అలుమ్ని’ గోల్డెన్ జూబ్లీ వేడుకలను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.

సైన్స్‌కు మానవత్వాన్ని జోడిస్తే ప్రతి ఆవిష్కరణ సమాజ హితానికి బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణను గ్లోబల్ ఫార్మా, లైఫ్ సెన్సైస్ హబ్‌గా మాత్ర మే కాకుండా ‘ఫార్మసీ ఆఫ్ పర్పస్’గానూ మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. రీసెర్చ్‌ను మార్కెట్‌కు, పాలసీని రోగికి అనుసంధానించే సమగ్రమైన 360 డిగ్రీల ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 18నెలల్లోనే లైఫ్ సెన్సైస్ రంగంలో కొత్తగా రూ.54 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. ఎలీ లిల్లీ లాంటి అంతర్జాతీయ ఫార్మా దిగ్గజ కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చి, ఇక్కడి యు వతకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు.

డాక్టర్ల కంటే వేగంగా రోగాలను నిర్ధారించినా, అనుభూతి చెందే మనసును మాత్రం ఏ యంత్రం భర్తీ చేయలేదని తెలిపారు. పేటెంట్లను కాకుండా మీ ఆవిష్కరణ వల్ల ఎంత మందికి మేలు జరిగింద న్నదే చరిత్ర గుర్తుంచుకుంటుందని యువ ఇన్నోవేటర్స్‌కు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాక తీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్ర తాప్ రెడ్డి, డా.బి.ప్రభా శంకర్ పాల్గొన్నారు.