calender_icon.png 12 October, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అహ్మద్‌గూడ శ్మశానవాటిక కబ్జా ఆరోపణలు

12-10-2025 03:34:40 AM

కీసర, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్ గూడ శ్మశాన వాటిక  స్థలం  కబ్జాకు గురైందన్న ఆరోపణలపై శనివారం హైడ్రా అధికా రులు విచారణ చేపట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మోడీ బిల్డర్స్ శ్మశానవాటిక స్థలాన్ని కబ్జా చేసిందంటూ గ్రామస్తులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు శనివారం అధికారులు అహ్మద్గూడలోని వివాదాస్పద శ్మశానవాటికను సందర్శించి, క్షేత్రస్థా యిలో ప్రాథమిక విచారణ జరిపారు. కబ్జాకు గురైందని చెబుతున్న భూమిని, దాని సరిహద్దులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధికారులకు సమస్యను వివరించి ఇక్కడి శ్మశానవాటికను కాపాడాలని కోరారు. పూర్తిస్థాయి విచారణ జరిపి, కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.