12-10-2025 03:30:59 AM
పార్టీ శ్రేణులతో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌లో ప్రజలను కలుస్తున్న సునీత
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ జనంలోకి దూసుకెళ్తున్నారు. శనివారం ఒక్కరోజే ఆమె విభిన్న వర్గాల ప్రజలను కలుస్తూ, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉదయం అపార్ట్‌మెంట్ వాకర్స్‌ను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. సాయంత్రం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
సునీత తన కుమారుడు వాత్సల్య నాథ్, కుమార్తె దిశిరతో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌లోని వాసవీ బృందావనం, బ్రిగేడ్, జనప్రియ, కల్పతరువు, లక్ష్మీ కాంప్లెక్స్ వంటి ప్రధాన అపార్ట్‌మెంట్లలో పర్యటించారు. మార్నింగ్ వాక్ చేస్తున్న నివాసితులతో కలిసి నడుస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో సునీత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్‌ఎస్ నేత, డివిజన్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలే కీలకమని ‘బీఆర్‌ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.