15 August, 2026 | 4:01 PM

ఘనంగా 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 03:26 PM

వీర్నపల్లి,ఆగస్ట్ 15  (విజయక్రాంతి): వీర్నపల్లి మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయంతో పాటు తెలంగాణ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని వక్తలు పిలుపునిచ్చారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.మండల కేంద్రంలోని అన్ని కార్యాలయాలు, పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడంతో వీర్నపల్లి అంతటా పండుగ వాతావరణం నెలకొంది.