15 August, 2026 | 4:19 PM

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

15-08-2026 03:47 PM

ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

భీమిని, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా భీమిని, మండలంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రజలు పలు పార్టీ కార్యాలయాల్లో పతాకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. భీమినిలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో రమేష్, తహశీల్దార్ భికర్ణదాస్, పీహెచ్సీలో వైద్యురాలు నిర్మల, వ్యవసాయ శాఖలో ఏఓ రజిత, జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంఈఓ వెంకటస్వామి, పోలీస్ స్టేషన్ లో ఎస్సై కోటేశ్వర్, పశు వైద్యశాల  లో వైద్యుడు దిలీప్, ఐకెపి ఏపిఎం బ్రహ్మయ్య, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఎస్ ఓ దివ్య, గ్రంథాలయంలో సంఘర్స్ రామారావు,  ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచులు, వివిధ పార్టీ కార్యాలయాల్లో మండల అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంఘర్స్ రవీందర్రావు, డిప్యూటీ తహశీల్దార్ గోవర్ధన్, ఆర్ ఐ కిషన్, సూపరింటెండెంట్ వేణుగోపాల్, సీనియర్ జూనియర్, అసిస్టెంట్లు ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ మండల అధ్యక్షులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.