15 August, 2026 | 5:27 PM

సీతారాంపురంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ కిషోర్

15-08-2026 04:30 PM

కారేపల్లి ఆగస్టు 15 విజయ క్రాంతి: సింగరేణి మండల పరిధిలో గల సీతారాంపురం గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ మూడ్ కిషోర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలీతమే మనకు ఈనాటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలని వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ మంచి పరిపాలనను అందించడమే నిజమైన స్వాతంత్రం అని తెలిపారు. అలాగే గ్రామ ప్రజల సైతం ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మర్శకట్ల నాగేశ్వరరావు , పంచాయతీ కార్యదర్శి ధరావత్ చరణ్,గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.