విద్యార్థులు దేశ సేవలో ముందుండాలి
జమలాపురం సర్పంచ్ నిర్మల కుమారి.
ఎర్రుపాలెం ఆగస్టు 15 (విజయక్రాంతి): విద్యార్థులు దేశ సేవలో ముందుండాలని జమలాపురం సర్పంచ్ నిర్మల కుమారి అన్నారు. శనివారం ఎర్రుపాలెం లోని భవిత డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు కాలినడకన జమలాపురం చేరుకొని సర్పంచ్ నిర్మల కుమారి కి 80 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్క విద్యార్థి ఆర్మీ నేవీ పోలీస్ తదితర విభాగాలలో మంచి ఉద్యోగాలను పొంది తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి అంకితభావంతో దేశ సేవ చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు అకాడమీ చైర్మన్ పూల నాగరాజు తో పాటుగా సర్దార్ జమలాపురం కళాశాల అధ్యాపకులకు శుభాకాంక్షలతో పాటుగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నాగిరెడ్డి రమేష్ ,గద్దల శ్రీనివాసరావు , భూక్య గోపి పాల్గొన్నారు.






