'ఇండియా' కూటమి గెలవబోతుంది: రాహుల్ గాంధీ
23-05-2024 04:21 PM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం తెలంగాణ, ఏపీ భవన్ కు వెళ్లారు. ఈ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి గెలవబోతుందని రాహుల్ జోస్యం చెప్పారు. ఢిల్లీలోని 7 సీట్లలోనూ విజయం సాధిస్తామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగం, రిజర్వేషన్లపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నారని రాహుల్ విమర్శించారు.






