2 August, 2026 | 5:10 AM

రసాయనిక పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

23-05-2024 08:04 PM

మహారాష్ట్ర: ఠాణే జిల్లాలోని డోంబివిలిలో గురువారం మధ్యాహ్నం అంబర్ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఐదుగురు మృతి చెందగా.. మరో 56 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అంబర్ రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు దెబ్బతిన్నాయి.