6 July, 2026 | 9:19 PM

Breaking News

మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •  

పాక్‌కు ఏడీబీ సాయం.. ఖండించిన భారత్

05-06-2025 12:00 AM
  1. 800 మిలియన్ డాలర్ల రుణానికి అంగీకారం తెలిపిన బ్యాంకు
  2. ఇప్పటికే భారత్ అభ్యంతరం చెప్పినా రుణమిచ్చిన ఐఎంఎఫ్

న్యూఢిల్లీ, జూన్ 4: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి రుణం పొందిన పాకిస్థాన్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కూడా 800 మిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజ్ మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. కాగా ఈ రుణం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీ మంజూరు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ నిధులను పాకిస్థాన్ సైనిక వ్యయం కోసం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

మేలోనే పాకిస్థాన్ ఐఎంఎఫ్ 1 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణం మంజూరు చేసింది. ఆ రుణ మంజూరు సమయంలో కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినా కానీ ఐఎంఎఫ్ ముందుకు సాగింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు చేస్తామని గతంలో ఏడీబీకి హామీనిచ్చిన పాక్ ఆ హామీని ఎంతమేర నెరవేర్చిందని ప్రశ్నించింది. భారత్ అభ్యంతరాలపై ఏడీబీ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.