05-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 4: ట్రంప్ పాలకవర్గం తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గళం విప్పారు. తాజాగా మరోసారి ఈ బిల్లుపై స్పందించిన ఆయన, ఇది ఒక చెడ్డ బిల్లు అని, దీని కారణంగా అమెరికన్లపై అధిక భారం పడుతోందని వ్యాఖ్యానించారు. ఈ బిల్లును ఉద్దేశిస్తూ మస్క్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను.
ఇది అత్యంత దారుణ మైంది. కాంగ్రెస్‌లో తీసుకొచ్చిన బిల్లు చాలా చెడ్డది. అది తప్పు అని మీకు తెలుసు. అయి నా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారంటే మీకే అవమానం’ అని రాసుకొచ్చారు. ఈ బిల్లు కారణంగా ద్రవ్యలోటు 2.5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని హెచ్చరించారు. ఇలాగే కొనసాగితే అమెరికా త్వరలోనే దివా లా తీస్తోందని హెచ్చరించారు.
మస్క్ వ్యాఖ్యలను ఖండించిన వైట్‌హౌస్, ఈ బిల్లుపై మస్క్ అభిప్రాయం ఏమిటన్నది అధ్యక్షుడు ట్రంప్‌కు తెలుసని ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ పేర్కొన్నారు. ఇది ట్రంప్ అభిప్రా యం ఏమాత్రం ప్రభావం చూపదన్నారు. రానున్న బిల్లు గొప్పదని, ఆయన దానికి కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.