28 March, 2026 | 4:54 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

కష్టకాలంలో దుష్ట రాజకీయాలు చేయవద్దు

28-03-2026 03:02 PM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. జెవర్ వద్ద రూ. 11,200 కోట్లతో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఫేజ్ -1( Phase I of Noida International Airport) అభివృద్ది చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu), యూపీ సీఎం ఆదిత్య నాథ్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. నోయిడా ఆధునిక ఎయిర్ పోర్టు రోడ్డు, రైలు, మెట్రో అనుసంధాన కేంద్రంగా మారింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ... భారత ప్రగతి.. ఆటంకం లేకుండా ముందుకెళ్తోందని తెలిపారు.

అంతర్జాతీయ సంక్షోభంలోనూ భారత్ తలెత్తుకుని నిలబడిందని చెప్పారు. సామాన్యులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. వికసిత్ భారత్ కోసం మౌలిక వసతులను ఆధునికీకరిస్తున్నామని వెల్లడించారు. మౌలిక వసతుల కోసం రూ. 17 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని లెక్క చెప్పారు. 40 వేల కిలో మీటర్ల రైల్వే లైన్లను విద్యుదీకరణ చేశామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా పోర్టుల సంఖ్యను రెండింతలు చేశామని సూచించారు.

వికసిత్ భారత్(Viksit Bharat) కోసం ప్రతి ఒక్క భారతీయుడూ ముందు రావాలని పిలుపునిచ్చారు. నిన్నముఖ్యమంత్రులతో చర్చలు జరిపినట్లు ప్రధాని సూచించారు. అందరం కలిసి సంక్షోభాన్ని ఎదుర్కోవాలని సీఎంలను కోరినట్లు తెలిపారు. కష్టకాలంలో దుష్ట రాజకీయాలు చేయవద్దని ప్రధాని మోదీ విపక్షాలను కోరారు. దేశానికి నష్టం కలిగించే పనులు చేయవద్దని ప్రధాని విజ్జప్తి చేశారు. దేశానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.