ఢిల్లీని స్వాధీనం చేసుకుంటాం!
- దర్యాప్తు సంస్థలనూ వాడుకుంటున్నారు
- బీజేపీ అధికారంలోకొస్తే బుల్డోజర్ల ప్రయోగం
- పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా, మార్చి 28: పశ్చిమ బెంగాల్‌ను ధ్వంసం చేయాలని చూస్తే బీజేపీ దేశంలో అధికారాన్ని కోల్పోతుందని, రానున్న ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించగానే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఢిల్లీని స్వాధీనం చేసుకోవడానికి ముందుకు వెళతానని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దర్యా ప్తు సంస్థలను సైతం గెలుపు కోసం బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు.
ముర్షిదాబాద్‌లో రామనవమి శోభాయాత్ర జరుగు తున్న సమయంలో ఘర్షణలు చోటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాణిగం జ్‌లో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇళ్లపైకి బుల్డోజర్లను ప్రయోగించి ప్రజలందరినీ బయటకు గెంటేస్తారని మమత ఆరోపించారు. బీజేపీ ఆదేశాల మేరకే హడావిడిగా ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టిందని ఆరోపించారు.
ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్‌ను బీజేపీ పావులా వాడుకుంటోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేకుండా చేయడం, దేశాన్ని రక్షించడమే తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని మమత స్పష్టం చేశారు. రాణిగంజ్ పర్వత ప్రాంతాల్లో తరచూ కొండచరియలు విరిగిపడుతుండడంతో ఇక్కడి ప్రజ లు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకర ప్రాంతాన్ని విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే వారికి తమ ప్రభు త్వం గృహవసతితోపాటు రూ. 10 లక్షల ఆర్థికసాయం అందిస్తుందని సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.




