అంతరిక్ష విహారానికి భారత్..
నవ నూతన అంతరిక్ష సాంకేతికతతో విశ్వ రహస్యాల అన్వేషణకు భారత్ సిద్ధమవుతుంది. ఈ క్రమంలో అంతరిక్ష పరిశోధనల్లో వాయు వేగంతో దూసుకెళ్తున్న భారత్ నేడు రెండో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది. 2023 ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రు ని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ లోని విక్రమ్ ల్యాండర్ ‘శివశక్తి’ చంద్రుడిలోని దక్షిణ ధ్రువం వైపున ఉన్న ప్రదేశంలో సురక్షితంగా దిగింది.
ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆగస్టు 23ను ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ మిష న్ విజయం అంతరిక్ష రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. భారతదేశం చంద్రు నిపై విజయవంతంగా అడుగుపెట్టిన నా లుగవ దేశంగా, దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరుకున్న మొదటి దేశంగా అవతరించింది. ఈ దినోత్సవం.. అంతరిక్ష పరిశోధ న ప్రాముఖ్యతపై అవగాహన, విద్యను ప్రోత్సహించడానికి ఒక వేదిక కానుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌లో వృత్తిని కొనసాగించడానికి భవి ష్యత్తు తరాలకు ప్రేరణ ఇవ్వనుంది.
‘ఆర్యభట్ట నుంచి గగన్‌యాన్ వరకు: లీవరే జింగ్ స్పేస్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ ఫర్ వికసిత్ భారత్ 2047’ అనే ఇతివృత్తంతో ఈసారి జాతీయ అంతరిక్ష దినోత్స వాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇక అంతరిక్ష రంగంలో భారత్ తనదైన ముద్ర వేస్తోంది. 50 ఏళ్ల క్రితం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 70 ఏళ్లు వెనకబడి ఉన్న భారతదేశం ఇప్పుడు ఆయా దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంది.
అమెరికాలో సహా ఎన్నో అభివృద్ధి చెందిన దే శాలు రూపొందించిన శాటిలైట్లను సైతం ఇప్పుడు కమర్షియల్ పద్ధతిలో లాంచ్ చేస్తోంది. గత పదేళ్లలో అంటే జనవరి 2015 నుంచి డిసెంబర్ 2024 వరకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు చెందిన పీఎస్‌ఎల్వీ, ఎల్‌వీఎం ఎస్‌ఎస్‌ఎల్వీ లాంఛ్ వెహికల్స్ ద్వారా మొత్తం 398 విదేశీ ఉపగ్రహాలను వాణిజ్య ప్రాతిపదికన ప్రయోగించారు. 2014కి ముందు 35 ఉపగ్రహాలతో పోలిస్తే ఇది 1000 శాతం కంటే ఎక్కువ. అంటే భారత్ అంతరిక్ష రంగంలో ఎంతలా దూసుకుపోతుందో ఒక అంచనాకి రావొచ్చు.
సొంతంగా అంతరిక్ష కేంద్రం
భారతదేశం అంతరిక్ష రంగంలో నవ శకానికి నాంది పలకడానికి సిద్ధమైంది. 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ఇస్రో నిర్దేశించుకున్నది. ఈ లక్ష్య సాధన దిశగా ప్రయాణించడానికి గగన్ యాన్ మిషన్ కీలకం కానుంది. ఇందులో భూమికి దగ్గరగా 400 కిలోమీటర్ల దూ రంలో భూ కక్ష్యలోకి పంపి, వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం ఈ మిషన్ తొలి లక్ష్యం.
ఇందులో భాగంగా మొదట 2026 నాటికి ‘వ్యోమమిత్ర’ అనే రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. అనంత రం 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’ మిషన్ చేపట్టనున్నారు. మరోవైపు మానవ సహిత చంద్రు డియాత్రకు ముందు ఇస్రో 2035 నాటికి సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం మానవ సహిత చంద్రుడియాత్రకు సిద్ధం కానుంది.
చంద్రయాన్- చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరిం చి భూమికి తిరిగి తీసుకురావడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ‘ఎల్‌వీఎం’ అనే పెద్ద రాకెట్లతో డాకింగ్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. ఈ సాంకేతికత భవిష్యత్తులో మావన సహిత యా త్రలకు, అంతరిక్ష కేంద్రాల నిర్మాణానికి చాలా అవసరం. ఇటీవల భారత వాయుసేన పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా యాక్సియం మిషన్‌లో మరో ముగ్గు రు వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) ప్రయాణించి తిరిగి వచ్చారు.
18 రోజుల పాటు శుభాంశు ఐఎస్‌ఎస్‌లో వివిధ పరిశోధనలు చేపట్టి గగన్‌యాన్ మిషన్ కోసం కీలక సమాచారం సేకరించారు. రాకేశ్ శర్మ అనంతరం రోదసిలో విహరించిన మరో భారతీయుడిగా శుభాంశు నిలిచా రు. ఇది భవిష్యత్తులో భారత్ చేపట్టబో యే మానవసహిత యాత్రలకు నాంది అని పలువురు అభివర్ణించారు. చంద్రయాన్- విజయవంతం అయిన తర్వాత, జపాన్ స్వయంగా భారత్ సహకారం కోరింది. దీనితో ఇస్రో, జపాన్ అంతరిక్ష సంస్థ ‘జాక్స’తో కలిసి చంద్రయాన్ లూపెక్స్ మిషన్ కోసం పనిచేయాలని నిర్ణయించారు.
నాణ్యమైన ఉపగ్రహాల ప్రయోగం
భారత అంతరిక్ష కార్యక్రమాలు ఆధునికంగా ముందుకెళ్లడానికి, ప్రజల దైనందిన జీవితాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతున్నాయి. అంతరిక్ష ప్రయోగాలకు కేం ద్రమైన ఇస్రో సౌండింగ్ రాకెట్‌తో మొద లు పెట్టి నేడు పీఎస్‌ఎల్వీ , జీఎస్‌ఎల్వీ, ఎల్‌వీఎం లాంటి రాకెట్లతో బారి ఉపగ్రహాలను ప్రయోగిస్తుంది. అత్యంత ఖచ్చిత త్వంతో తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నది. మరోవైపు వాణిజ్య ఉపగ్రహాలతో విదేశీ మారకద్రవ్యాన్ని అర్జిస్తుం ది.
ఇస్రో ప్రయోగించే ఉపగ్రహలతో వాతావరణ సూచన, సమాచార మార్పిడి (టీవీ, ఇంటర్నెట్), నావిగేషన్, భూమి పరిశీలన (పర్యావరణ మార్పులు, విపత్తులు), శాస్త్రీయ పరిశోధన, రక్షణ వంటి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. మరోవైపు ఇస్రో పునర్వినియోగ రాకెట్ల(పుష్పక్) తయారీ, చిన్న రాకెట్ల ప్రయోగ వేదికను సిద్ధం చేస్తుంది. వీటితో తక్కువ ఖర్చుతో ఉపగ్రహాల ప్రయోగం, సత్వర లాభానికి బీజం పడనుంది.
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం. తద్వా రా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. ఈ విధానం ద్వారా అంతరిక్ష సంబంధిత కార్యకలాపాల్లో ప్రైవేట్ సంస ల భాగస్వామ్యాన్ని పెంచడం, పరిశోధన, అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుం ది. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో అగ్నికుల్ కాస్మోస్ , స్కురైట్ ఏరోస్పేస్ సంస్థలు అంతరిక్ష ఉపగ్రహ వాహననౌకల తయారీకి సిద్ధమైనది.
పరిశోధనలకు బడ్జెట్?
అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్ అంతరిక్ష ప్రయోగాలు కొనసాగుతున్నప్పటికీ.. భారత దేశం అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కేవలం 2 శాతం మాత్రమే కలిగి ఉంది. దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అంతరిక్ష ప్రయోగాల పట్ల పిల్లలు, యువతలో ఆసక్తిని పెంచాలి. వీటిపై మక్కువ ఉన్న విద్యార్థులను ప్రొత్సాహించేందుకు ‘ఇస్రో యువిక (యుంగ్ సైంటిస్ట్)- 2025 కార్యక్రమం నిర్వహిస్తున్నది.
ఉన్నత విద్య, పరిశోధనలో యువ భాగస్వామ్యాన్ని పెంచాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే మన విద్యా వ్యవస్థలో నాణ్యత చాలా తక్కువ. మంచి విద్య, ఉద్యోగాల కోసం విదేశీ వలసలు జరుగుతున్నాయి. మరోవైపు, భారత్లో ఉన్నత విద్యలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య 28 శాతమే. దీన్ని 2035 కల్లా 50 శాతానికి పెంచాలనీ, మన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించాలని 2020 నూతన విద్య విధానం ఆకాంక్షిస్తుంది.
దీనికి అనుగుణంగా విదేశీ వర్సిటీ లకు భారత్ స్వాగతం పలుకుతుంది. ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా స్వీకారం చుట్టారు. కానీ వీటి నాణ్యత ప్రమాణాలు ప్రశ్నార్థకమే. ఇందులో పేద బడుగు బలహీన వర్గాలు చదవడం కష్టమే. ప్రపంచం లో అత్యధిక జనాభా గల భారతదేశం నోబెల్ విజేతల్లో వెనుకబడింది.
ఇవి మన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు నిదర్శనం. శాస్త్ర పరిశోధనలకు మన జీడీపీలో ఒక శాతం లోపే మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధన, అభివృద్ధికి కేంద్రం మరింత బడ్జెట్ కేటాయిస్తే నవ నూతన ఆవిష్కరణలతో దూసుకెళ్లే అవకాశముంటుంది. అప్పుడే ‘వికసిత్ భారత్ 2047’ కల సాకారమవుతుంది.
వ్యాసకర్త సెల్: 7989579428






