calender_icon.png 13 February, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ షో

13-02-2026 12:57:07 AM

నమీబియాపై భారీ విజయం

ఇషాన్, హార్థిక్ విధ్వంసం

తిప్పేసిన వరుణ్, అక్షర్ పటేల్

గ్రూప్‌లో టాప్ ప్లేస్‌కు భారత్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : ఈ మ్యాచ్‌లో ఊ హించినట్టుగానే తుది జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది. అభి షేక్ శర్మ కోలుకోకపోవడంతో సంజూ శాంసన్‌కు చోటు ద క్కింది. అలాగే మహ్మద్ సిరాజ్ ప్లేస్‌లో జస్ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చాడు. టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. భారీ స్కోరే లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ అనుకున్న ఆరంభాన్నివ్వలేకపోయారు.

వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయిన సంజూ శాం సన్ 8 బంతుల్లో 1 ఫోర్ , 3 సిక్సర్లతో 22 పరుగులకు ఔటయ్యా డు. అయితే ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ మాత్రం రెచ్చిపోయాడు. తన బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తూ నమీబి యా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. అటు తిలక్ వర్మ కూడా దూకుడుగానే ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 31 బంతుల్లోనే 79 పరుగులు జోడించారు.

మరో సెంచరీ చేస్తాడనుకుంటుండగా ఇషాన్ కిషన్ 24 బంతు ల్లో 61 రన్స్ (6 ఫోర్లు, 5 సిక్సర్లు)కు వెనుదిరిగాడు. కాసేపటికే తిలక్ వర్మ (25), సూర్య కుమార్ యాదవ్ (12) పరుగులకే ఔటవడంతో మరో 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరి స్థితుల్లో హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా పాండ్యా తనదైన భారీ సిక్సర్లతో నమీబియా బౌలర్లకు చుక్కలు చూపించాడు.

కేవలం 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 రన్స్ చేశాడు. దూబే (23) పరుగులు చేయగా.. చివర్లో టెయిలెండర్లు వరుసగా వికెట్లు ఇచ్చేసుకున్నారు. చివరికి భారత్ 9 వికెట్లకు 209 పరు గులు చేసింది. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ 20 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తర్వాత ఛేజింగ్‌లో నమీబియా దూకుడుగానే ఇన్నిం గ్స్ ప్రారంభించింది.

పవర్ ప్లేలో వీలైనంత వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో నమీబియా ఓపెనర్లు తొలి వికెట్ కు 33 పరుగులు జోడించారు. తర్వాత అర్షదీప్ సింగ్ వీరి పార్టనర్ షిప్ ను బ్రేక్ చేయగా..  ఫ్రైలింగ్ (22), స్టికాంప్ (29) పరుగులకు ఔటయ్యారు. ఇక్కడ నుంచి భారత్ పూర్తిగా పట్టుబిగించింది. స్పిన్నర్ల ఎం ట్రీతో నమీబియా చేతులెత్తేసింది. వరుణ్ చక్రవర్తి అద్భుతమైన స్పెల్ తో తిప్పేశాడు.

కేవ లం 2 ఓవర్లలో 7 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. అటు అక్షర్ పటేల్ కూడా స్పిన్ మ్యాజిక్ చూపించడంతో నమీబియా కోలుకోలేకపోయింది. 3 వికెట్లకు 86 రన్స్ తో కని పించిన ఆ జట్టు 116 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పాండ్యా 2 , దూబే 2, అర్షదీప్, బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో భారత్ 94 పరుగుల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో గ్రూప్ ఏలో భారత్ టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది.

స్కోరు బోర్డు

భారత్ ఇన్నింగ్స్ : 209/9 ( ఇషాన్ కిషన్ 61, హార్థిక్ పాండ్యా 52, తిలక్ వర్మ 25 ; ఎరాస్మస్ 4/20, బెర్నార్డ్ 1/41)

నమీబియా ఇన్నింగ్స్ : 116 (స్టీన్‌కాంప్ 29, ఫ్రైలింక్ 22, ఎరాస్మస్ 18 ; వరుణ్ చక్రవర్తి 3/7, అక్షర్ పటేల్ 2/20)