calender_icon.png 12 November, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాజ్పేయి స్ఫూర్తితో బిజెపి ముందుకు..

24-04-2025 04:42:58 PM

నిర్మల్ (విజయక్రాంతి): బిజెపి సీనియర్ నేత మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి స్ఫూర్తితో భారతదేశం మరింత ముందుకు వెళ్లే విధంగా మోడీ ప్రభుత్వం(Modi Govt) కృషి చేస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్(BJP District President Ritesh Rathod) అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో బిజెపి ఆధ్వర్యంలో వాజ్పేయిపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధానిగా సామాజికవేత్తగా ఆయన చేసిన సేవలను కొనియాడిన అధ్యక్షులు దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావుల రామనాథ్ నరసింహ రాజు అలివేలు సాయి రాచకొండ సాగర్ తదితరులు పాల్గొన్నారు.