15 March, 2026 | 1:07 AM

పదో తరగతి పరీక్షలకు 100% హాజరు

14-03-2026 09:50 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలంలోని పలు పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు పూర్తి హాజరు నమోదు చేశారు. జెడ్పీహెచ్ఎస్ బాలుర భిక్కనూర్ పాఠశాలలో 158 మంది, జెడ్పీహెచ్ఎస్ బాలికల భిక్కనూర్ పాఠశాలలో 177 మంది, జెడ్పీహెచ్ఎస్ పెద్దమల్లారెడ్డి పాఠశాలలో 96 మంది, జెడ్పీహెచ్ఎస్ జంగంపల్లి పాఠశాలలో 202 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 633 మంది విద్యార్థులకు గాను 633 మంది పరీక్షలకు హాజరై 100 శాతం హాజరు నమోదైనట్లు మండల విద్యాశాఖ అధికారి రాజగంగారెడ్డి తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు.