9 April, 2026 | 3:12 AM

పసిఫిక్ ద్వీప దేశాలకు భారత్ ఆఫర్

30-08-2024 12:16 AM
  1. ఒక్కో దేశానికి 50 వేల డాలర్లు 
  2. పీఐఎఫ్ సదస్సులో కేంద్రమంత్రి పబిత్రా మార్గరిటా

న్యూఢిల్లీ, ఆగస్టు 29: పసిఫిక్ ద్వీప దేశాలకు భారత్ భారీ ఆఫర్ ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్రంలోని 14 దేశాలకు త్వరితగత ప్రభావం చూపే ప్రాజెక్టుల్లో 50 వేల డాలర్ల చొప్పున అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. టొంగా రాజధాని నుకువాలోఫాలో జరుగుతోన్న పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం (పీఐఎఫ్) సదస్సులో భాగంగా గురువారం నిర్వహించిన భాగస్వామ్ దేశాల సదస్సులో భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరిటా ప్రసంగించారు. పసిఫిక్ ద్వీప దేశాల నుంచి ప్రతిపాదనలు రావడం సంతోషకరమని, వారికి ఎల్లప్పుడూ భారత్ మద్దతు ఉంటుందని స్ఫష్టం చేశారు. ద్వీప దేశాలతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.