సఫారీ మహిళలతో భారత్ ఏకైక టెస్ట్
సౌతాఫ్రికా టూర్ షెడ్యూల్ ప్రకటన
ముంబై, మార్చి 20 : భారత మహిళల జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో మరో చారిత్రక మ్యాచ్ ఆడబోతోంది. ఇటీవలే ఆసీస్ టూర్ లో టెస్ట్ ఆడిన భారత్ ఏడాది చివర్లో సౌతాఫ్రికాపైనా రెడ్ బాల్ మ్యాచ్ ఆడనుంది. దీని కి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటంచింది. మొదట సౌతా ఫ్రికా ఎమర్జింగ్ టీమ్‌తో భారత మహిళల జట్టు వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
ఆ తర్వాత డిసెంబర్ 9 నుంచి 15 మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతుంది. డిసెంబర్ 20 నుం చి 23 మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. 24 ఏళ్ల కిందట మహిళల జట్టు సౌతాఫ్రికాలో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. అప్పటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 9 వికెట్ల నష్టానికి 404 పరు గుల వద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది.
తర్వాత ఫాలోఆన్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 266 పరుగులే చేయగలిగింది. అనంతరం 13 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 1.3 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా ఛేదించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి అద్భుత విజయాన్ని సాధిస్తిందేమో చూడాలి. ఇదిలా ఉంటే టీ20 ప్రపం చకప్ సన్నాహకంగా వచ్చే నెలలో సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడబోతోంది. మహిళల టీ20 ప్రపంచకప్ ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది.




