20 March, 2026 | 11:54 AM

కోల్‌కథ మారేనా?

20-03-2026 12:00 AM

మరో 8 రోజుల్లో 

* ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు(3) ట్రోఫీ గెలిచిన ఘనత కోల్‌కత్తా నైట్ రైడర్స్ దే. 2014 తర్వాత పదేళ్లకు ఛాంపియన్ అయిన కేకేఆర్ ఆ తర్వాత మళ్లీ చతికిలపడింది. గత సీజన్‌లో అయితే అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచింది. 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రహానే కెప్టెన్‌గా నిరాశపరిచినప్పటకీ ఇప్పుడు మరోసారి జట్టును నడిపించబోతున్నాడు. వేలంలో గ్రీన్ కోసం భారీ బిడ్ వేసి దక్కించుకున్న కోల్‌కథ ఈ సారైనా మారుతుందా ?

  1. గత సీజన్‌లో ఫ్లాప్ షో
  2. కెప్టెన్‌గా ఆకట్టుకోని రహానే
  3. గ్రీన్ కోసం రికార్డు బిడ్
  4. పతిరణ, హర్షిత్ రాణాలకు గాయాలు

కోల్‌కత్తా, మార్చి 19 : ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఆ జట్టులో స్టార్ ప్లే యర్స్‌కు కొదవ లేదు. లీగ్ మొదలైన ఐదో ఏడాది తొలి టైటిల్ ను ముద్దాడిన కేకేఆర్ ఆ తర్వాత 2014లో మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే రెండోసారి టైటిల్ గెలిచినప్పటి నుంచీ కోల్‌కత్తా ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ముచ్చటగా మూడోసారి ట్రోఫీ గెలిచేందుకు ఏకంగా పదేళ్లు పట్టేసింది.

పైగా ఆరేళ్లలో నలుగురు కెప్టెన్లు మారారు. జట్టును బాగా నడిపిస్తున్న శ్రేయాస్ అయ్యర్ వంటి వారిని వదిలేసుకోవడం కూడా కేకేఆర్ అవకాశాలను దెబ్బతీ సింది. 2025 సీజన్‌లో నైట్ రైడర్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో బరిలోకి దిగి కనీసం ప్లే ఆఫ్స్ కూ డా చేరలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమతమవడంతో వేలానికి ముందు భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.

చాలా మంది ప్లేయర్స్‌ను వదిలేసుకుని అందరికంటే ఎక్కువ మనీ పర్స్ (రూ.64.30 కోట్లు)తో వేలంలోకి వెళ్లింది. మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ కోసం ఏకంగా రూ.25.20 కోట్లు వెచ్చించింది. మిగిలిన బడ్జెట్‌లో మంచి ప్లే యర్స్‌నే తీసుకుంది. డెత్ బౌలింగ్ సమస్యను అధిగమించేందుకు మహే శ్ పతిరణను రూ.18 కోట్లకు తీసుకుంది. అయితే పతిరణ గాయంతో బాధపడుతుండడంతో ఇప్పుడు కేకేఆర్‌కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.

మరోవై పు న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సిఫెర్ట్ లను మంచి ధరకే దక్కించుకోవడం కూడా కోల్ కత్తాకు కలిసొచ్చిం ది. ప్రస్తుత సీజన్‌లో కోల్‌కత్తా బలాలను చూస్తే ఆల్ రౌండర్లు కామెరూన్ గ్రీన్, సునీల్ నరై న్, రమణ్ దీప్ సింగ్‌లు కీలకమని చెప్పొ చ్చు. బౌలింగ్‌లో పతిరణ, హర్షిత్ రాణా లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేకేఆర్‌కు ప్ర ధాన బలమయ్యే అవకాశముంది.

అన్నింటికీ మించి రహానే కెప్టెన్సీకి ఈ సీజన్ పెద్ద పరీక్ష. గత సీజన్‌లో రహానే సారథిగా ఏమా త్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ఆధ్వర్యంలో రహానే కేకేఆర్‌ను ఎంతవరకూ విజయవంతంగా నడిపిస్తాడనేది చూడాలి. 

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు :

అజింక్యా రహానే(కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, రోవ్మన్ పోవెల్,  మనీ ష్ పాండే, సునీల్ నరైన్, రమణ్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్. కామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, మతీషా పతిరానా, తేజస్వి సింగ్, కార్తీక్ త్యాగి , ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, ముస్తాఫిజుర్ రెహమాన్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర , ఆకాష్ దీప్