4 August, 2026 | 4:18 AM

చంద్రయాన్‌తో భారతదేశం అగ్రదేశాల సరసన నిలిచింది

23-08-2024 06:08 PM

డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సప్తగిరి కాలనీ యందు నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ... గత సంవత్సరం భారత ప్రభుత్వం మరియు ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం విజయవంతం అవడంతో మన దేశం అగ్రదేశాల సరసన నిలిచిందని అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం అవుతుండడం భారతదేశ అభివృద్ధికి చిహ్నమని ఒకప్పుడు రాకెట్ ప్రయోగానికి రాకెట్లను సైకిల్ పై తీసుకెళ్లిన స్థాయి నుండి గురువారం రోదసిలోనే మన దేశ జెండాను నిలిపేస్తాయికి ఎదిగిన ఘన చరిత్ర ఇస్రోదని, ఇది మన దేశం సాధించిన గొప్ప ప్రగతి అని పేర్కొన్నారు.

భారతదేశం నేడు అంతరిక్ష రంగంలో రాకెట్ అంత స్పీడుగా దూసుకెళ్తుందని ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ అధునాతన మొబైల్ టెక్నాలజీ వంటి ఎన్నో ఆధునిక టెక్నాలజీలకు భారతదేశ అంతరిక్ష రంగం సాధించిన ప్రగతేనని అద్భుత విజయాలను మూటగట్టుకున్న ఇస్రోకు మనమంతా కృతజ్ఞులమై ఉండాలని వారు సూచించారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలకు అధిక ప్రాధాన్యతనిస్తూ గొప్ప పరిశోధనలకు ప్రోత్సహిస్తుందని దానిని ఇస్రో అందిపుచ్చుకొని ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా వారు కొనియాడారు. తదనంతరం ఈరోజు పాఠశాలలో అంతరిక్ష దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో మరియు క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.