భారత్ ఉత్కంఠ విజయం
- ఐదో టెస్టులో 6 పరుగులతో ఇంగ్లండ్ ఓటమి
- సిరీస్‌ను 2 సమం చేసిన టీమిండియా
-మెరిసిన సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ
లండన్, ఆగస్టు 4: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2 సమం చేసింది. మ్యాచ్‌లో 9 వికెట్లు తీసిన సిరాజ్ ‘ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకోగా.. భారత కెప్టెన్ గిల్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సంయుక్తంగా పంచుకున్నారు. 374 పరుగుల టార్గెట్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది.
బ్రూక్, రూట్ సెంచరీలతో మెరిసినప్పటికీ మిగతావారు విఫలమవ్వడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 5 వికెట్లతో మెరవగా.. ప్రసిధ్ క్రిష్ణ 4 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు భారత్ తొలి ఇన్సింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. జైస్వాల్ వీరోచిత సెంచరీకి తోడు జడేజా, ఆకాశ్‌దీప్, సుందర్‌లు అ ర్థసెంచరీలతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది.
సీఎం అభినందనలు
ఐదో టెస్టులో ౯ వికెట్ల ప్రద ర్శన చేసిన మహ్మద్ సిరాజ్‌కు సీఎం రే వం త్ రెడ్డి ‘ఎక్స్’వేదికగా అభినందనలు తెలిపారు.






