06-08-2025 12:46:32 AM
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): పాలిసెట్‌లో 16,458 సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 115 కాలేజీల్లో 29,449 సీట్లకుగానూ ఇప్పటి వరకు 16,458 (55.8 శాతం) సీట్లు నిండగా, ఇంకా 12,991 సీట్లు మిగిలాయి. ఇంటర్నల్ స్లుడింగ్‌ను చేపట్టిన అధికారులు మంగళవారం సీట్ల వివరాలను ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 675 మంది సీట్లు పొందారు. 667 మంది విద్యార్థులు 2,004 ఆప్షన్లను నమోదు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.