calender_icon.png 19 February, 2026 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరేనా పోలో చాంపియన్‌షిప్ విజేత భారత్

19-02-2026 02:27:14 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 18 : హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ అరేనా పోలో ఛాంపియన్‌షిప్‌ను భా రత జట్టు కైవసం చేసుకుంది. హోరాహోరీ గా సాగిన ఫైనల్లో భారత్ 18 గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించింది.

భారత్ తరపున అర్సలాన్ ఖాన్ అత్యధికంగా 9 గోల్స్ చేయగా.. సలీమ్ అజ్మి 6 గోల్స్, చైతన్య కు మార్ 1 గోల్ చేశారు. విజేతగా నిలిచిన భారత్‌కు తెలంగాణ టూరిజం శాఖ మంత్రి జూ పల్లి కృష్ణారావు ట్రోఫీ అందజేశారు. బెస్ట్ ఫో టోగ్రాఫర్ అవార్డును మహ్మద్ వాహీదుద్దీన్‌కు హెచ్‌పీఆర్‌సీ సెక్రటరీ రియాజ్ అహ్మద్ అందజేశారు. ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యేలు జె.అనిరుధ్‌రెడ్డి, యన్నం శ్రీనివా సరె డ్డి, శాట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ విజేందర్ సింగ్, పాల్గొన్నారు.