15 July, 2026 | 2:23 AM

ఐపీఎల్ టికెట్ల గందరగోళం

26-04-2024 12:19 AM

ఉప్పల్ స్టేడియం ముందు కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన


హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఉప్పల్ స్టేడియం ముందు ఆందోళన చేపట్టారు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతూ క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియే షన్ (హెచ్‌సీఏ) నిరాశకు గురిచేస్తోందని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి అన్నారు. ఇప్పటికైనా హెచ్‌సీఏ తన పద్ధతి మార్చుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నాయకులను పోలీసు లు అరెస్ట్ చేసి ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఉప్పల్‌లో స్టేడియంలో గురువారం బెంగళూరు, హైదరాబాద్ మ ధ్య మ్యాచ్ జరగగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.