21 May, 2026 | 6:01 AM

నేపాల్‌ నదిలో పడిన పర్యాటక బస్సు: 14 మంది దుర్మరణం

23-08-2024 12:55 PM

ఖాట్మండు: ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన పర్యాటక బస్సు నేపాల్ లో నదిలో పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదసమయంలో బస్సులో 40 మంది భారతీయ యాత్రికులు ప్రయాణి స్తున్నారు. ఖాట్మండు నుంచి పోఖరా వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. నలభై మంది ప్రయాణికులతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయిందని నేపాల్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. "యుపి ఎఫ్‌టి 7623 నంబర్ ప్లేట్ గల బస్సు నదిలో పడి నది ఒడ్డున పడి ఉంది" అని జిల్లా పోలీసు కార్యాలయం తనహున్ నుండి డిఎస్‌పి దీప్‌కుమార్ రాయ ధృవీకరించారు. అధికారిక సమాచారం ప్రకారం, బస్సు పోఖారా నుండి ఖాట్మండుకు వెళుతోంది. ఘటనాస్థలికి చేరుకున్ననేపాల్ పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించాయి. సహాయక బృందాలు 14 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.