పిల్లలకు గంజాయి మత్తు.. భవిష్యత్తంతా చిత్తు
హైదరాబాద్: ఉన్నత స్థాయికి చేరాల్సిన పిల్లలు గంజాయి మహమ్మారికి భానిసలవుతున్నారు. వీరిలో మంచి ఉద్యోగంలో స్థిరపడిన బిడ్డలు డ్రగ్స్ పంజా చేతికి చిక్కి విలవిలలాడుతూ ఉండటం చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు.టీజీ న్యాబ్ దర్యాప్తులో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా బయట పడుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 40 వేల మందికి పైగా డ్రగ్స్ వినియోగ దారులను అధికారికంగా గుర్తించారు. అందులో గత 7 నెలల కాలంలోనే సుమారు 6 వేల మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) మత్తు పదార్థాల సరఫరాదారులు, విక్రేతలతో పాటు వాటికి అలవాటు పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులను గుర్తిస్తున్నారు. మద్యం మత్తులో నేరాలు ఘోరాలు కూడా ఎక్కువవుతున్నాయి. సాధారణంగా మద్యం తాగిన వారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్లు మాదిరి ఆధునిక డ్రగ్ టెస్టింగ్ కిట్లను అందుబాటు లోకి తెచ్చినట్లు టీజీనాబ్ అధికారులు పేర్కొన్నారు.






