10 July, 2026 | 3:08 AM

ఇండియన్ మోనాలీసా

30-11-2024 04:06 AM

ఏఐతో అద్భుతం చేసిన ఢిల్లీ విద్యార్థిని

న్యూఢిల్లీ, నవంబర్ 29: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఉపయోగించి ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాశి పాండే అనే విద్యార్థిని అద్భుతం చేసింది. ప్రముఖ కళాకారుడు లియోనార్డో డా విన్సీ గీసిన మోనాలీసా చిత్రానికి ఇండియన్ వర్షన్‌ను రూపొందించింది. ఏఐ టూల్స్‌ను ఉపయోగించి గీసిన ఇండియన్ వర్షన్ మోనాలీసా చిత్రంలో భారతీయ సంప్రదాయం ఉట్టిపడుతోంది. దుప్పట్టా కప్పుకుని, నగలు ధరించినట్టుగా ఉన్న చిత్రాన్ని రాశి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ ఇండియన్ స్టుల్‌లో ఉన్న మోనాలీసాకు ఓ మంచి పేరును సూచించాలంటూ కోరింది. ఆమె పోస్ట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది.