మార్కెట్లలో బుల్లిష్ జోరు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) మంగళవారం లాభాలతో ముగిశాయి. కొనుగోళ్ల జోరుతో ప్రధాన సూచీలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 685 పాయింట్లు లాభపడి 73,068 వద్ద ముగియగా.. నిఫ్టీ 220 పాయింట్లు ఎగబాకి 22,776 వద్ద స్థిరపడింది. రోజంతా మార్కెట్లలో సానుకూల వాతావరణం కొనసాగడంతో కీలక సూచీలు గణనీయంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా సెన్సెక్స్ 73 వేల మార్క్‌ను అధిగమించి ముగియడం మార్కెట్ ట్రెండ్(Market trend)లో బలాన్ని సూచించింది. నిఫ్టీ సైతం 22,700 స్థాయిని దాటి క్లోజ్ కావడంతో ఇన్వెస్టర్లలో(Investors) సానుకూలత కనిపించింది. మార్కెట్ల ముగింపు సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ గణనీయమైన లాభాలను నమోదు చేశాయి.