21 July, 2026 | 7:59 AM

కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్

20-07-2026 06:28 PM

ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి మున్సిపాలిటీ 22వ వార్డు కమ్యూనిటీ హాలులో ఇందిరాశక్తి ఇందిరమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మహిళలకు పెద్దపీట వేసి, గౌరవంగా బతికేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భువనగిరిలో కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు చల్ల కిషోర్, బిక్షపతి, మనీష్, మహేందర్, ప్రమోద్, వార్డు ఆఫీసర్ రాము, ఆర్ పి లు లక్ష్మి, రాధ, మహిళలు పాల్గొన్నారు.