అంబరాన్నంటేలా ఇందిరమ్మ పండుగ...
- జూన్ 2న జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాక
- ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు పొంగులేటి,జూపల్లి
కుమ్రంభీం ఆసిఫాబాద్,మే20( విజయ క్రాంతి) జిల్లాలో జూన్ 2న నిర్వహించనున్న ఇందిరమ్మ పండుగ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, రెవె న్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలను జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దండే విఠ ల్, జిల్లా కలెక్టర్ కె. హరిత, మంచిర్యాల, బె ల్లంపల్లి ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్ తదితరులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పేదల గృహ కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వేలాది నిరుపేదలకు గూడు కల్పించామని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకు గౌరవప్రదమైన జీవనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కొఠారి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు ఆదివాసీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయని పేర్కొన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభమయ్యే ఇందిరమ్మ నిర్మాణ పండుగలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలోని మూడు గ్రామాలను సందర్శించనున్నట్లు వెల్లడించారు. మహిళలకు మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరా మహిళా శక్తి, రేషన్ కార్డులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.విద్య, వైద్య రంగాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో 2026-28 సంవత్సరాలకు గాను అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులను మంత్రులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత ,ఎస్పి నితిక పాటిల్,ఎమ్మెల్సీ దండే విటల్,డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ,నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం నాయక్,మాజీ డిసిసి విశ్వ ప్రసాద్ రావు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు,నాయకులు పాల్గొన్నారు.






