30-04-2025 01:20:14 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాం తి): జనగామలో కుర్మవాడకు చెందిన పర్శసాయి అనారోగ్యంతో జీవచ్చవంలా మారి న దీన పరిస్థితి తన దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. పర్శసాయి ఆరోగ్య పరిస్థితి, తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితిపై ఆరా తీసి ప్రభుత్వం తరఫున సహా యం చేయాలని అధికారులను ఆదేశించాన న్నారు.
రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మంగళవారం పర్శసాయి ఇంటికి వెళ్లారు. ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఆ కుటుంబ ఉ పాధికి రాజీవ్ యువ వికాసం పథకం ద్వా రా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సాయికి నిమ్స్‌లో వైద్య సహాయం అందించడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.