18 April, 2026 | 6:51 PM

త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు

08-12-2024 07:52 PM

గిరిజన సంక్షేమశాఖ చైర్మన్ కొట్నాక తిరుపతి...

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బడుగు, బలహీన వర్గాల ప్రజలు స్వంత ఇంటి కోసం కంటున్న కళాలను త్వరలోనే ప్రజా ప్రభుత్వం సాకారం చేస్తుందని గిరిజన సంక్షేమశాఖ చైర్మెన్ కొట్నాక తిరుపతి పేర్కోన్నారు. ఆదివారం బెజ్జుర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్‌ రావుతో కలిసి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎడాది కాలంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ప్రతి పక్షాల మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు. పేద ప్రజలకు విద్య, వైద్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఉద్యోగ కల్పన కోసం ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి తదితరులు పాల్గొన్నారు.