సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం
08-12-2024 07:41 PM
కామారెడ్డి (విజయక్రాంతి): గురుకులాల సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని బిఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అర్‌అండ్‌బి అతిధి గృహంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకుల బాటలో భాగంగా వారం రోజులుగా కామారెడ్డిలోని అన్ని గురుకులాల్లో పర్యటించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నామని, నివేదికను పార్టీ కార్యాలయంలో సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్, నాయకులు పరుశురాం గౌడ్, సాయి తదితరులు ఉన్నారు.






