18 April, 2026 | 8:24 PM

సీఎం ఇచ్చిన హమీలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేకు వినతి

08-12-2024 08:10 PM

కామారెడ్డి (విజయక్రాంతి): ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హమీ ఇచ్చారని ఇంత వరకు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కారించడం లేదని, అసెంబ్లీలో ప్రస్తావించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కొరారు. ఆదివారం వారు కామారెడ్డి ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హమీ విషయమై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై గతంలో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులను కలవడం జరిగిందని, అయినా సమస్య పరిష్కారం కాలేదని వివరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు శైలజ, లింగం, కాళిదాసు, దినేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.