18 April, 2026 | 7:37 PM

కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ

18-04-2026 06:16 PM

దమ్మపేట,(విజయక్రాంతి): తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించనున్న కొత్త రాజకీయ పార్టీ అవిర్భావ సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను శనివారం అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి, ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, లాయర్ సొడెం వెంకట్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు డి. వీరన్న ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డి.వీరన్న మాట్లాడుతూ... ఏప్రిల్ 25, 2026న ఉదయం 8 గంటలకు జరగబోయే పార్టీ ఆవిర్భావ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కాకా బాబురావు, కుర్సం సతీష్, పానుగంటి లోకేష్, సంగం కృష్ణమూర్తి తెలంగాణ జాగృతి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ మత్తే సతీష్, మాజీ సర్పంచ్ తాటి పోతురాజు, వాసం పోలయ్య, కుర్సం రాంబాబు, కె.కేశవ్ గౌడ్, తగరం రాంబాబు, వి. రవి, లకావత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.